28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

పెయింటర్ కాలనీలో రౌడీ షీటర్ వీరంగం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని పెయింటర్ కాలనీకి చెందిన రౌడీ షీటర్ సోమవారం రాత్రి వీరంగం స్రుష్టించాడు. పెయింటర్ కాలనీకి చెందిన జియా కత్తితో కాలనీలోని ప్రజలను భయబ్రాంతుకులకు గురిచేశాడు. దారిన వెళుతున్న ఇద్దరిపై కత్తితో దాడి చేశాడు. అదే ప్రాంతానికి చెందిన సదమ్ నడుచుకుంటు వెళుతున్నాడు. తన ఇద్దరు స్నేహితులతో బైక్ పై వచ్చిన జియా కత్తితో చాతిపై పొడిచాడు. వెంటనే స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి పక్కనే ఉన్న నయా బ్రిడ్జ్ వద్ద జునైద్ అనే యువకుడిని కత్తితో పొడిచి పరారయ్యాడు. నిందితుడు నెల రోజుల క్రితమే జైలు నుంచి బెయిల్ పై వచ్చాడు.

More articles

Latest article