కామారెడ్డి, బతుకమ్మ: ముఖ్యమంత్రి రేవంత్ ది అనుభవం లేని పాలన అని, మాజీ సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మార్చారని బీజేపీ జాతీయ ఉపాద్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి తరఫున ఆమె సోమవారం కామారెడ్డిలో నిర్వహించిన సమావేశంలో అరుణ పాల్గొని మాట్లాడారు. 420 హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఎస్ ఎల్ బీసీ లో చిక్కుకున్న ఉద్యోగుల గురించి పట్టించు కోకుండా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం లో పాల్గొనడం సిగ్గుచేటని విమర్శించారు. రాష్ర్టంలో అమలవుతున్న ప్రతి పథకంలో కేంద్రం వాటా ఉందని, తెలంగాణలో త్వరలో జరిగే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురడం ఖాయమన్నారు.
