27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

రేషన్ షాప్ కోసం వినతి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూర్: బిక్కనూరు మండలంలోని తిప్పాపూర్ గ్రామంలో గల ఎస్సీ కాలనీలో రేషన్ షాప్ ఏర్పాటు చేయాలని కాలనీలోని యువకులు శనివారం ఎమ్మార్వో కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కాలనీలోని ప్రజలు రేషన్ సరుకులు తీసుకోవాలంటే కొన్ని కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుందని అన్నారు. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అనేక సందర్భాలలో రోడ్డు ప్రమాదాలు జరిగి కొందరు మరణించారని తెలిపారు. అధికారుల స్పందించి తమ కాలనీలో రేషన్ షాప్ ఏర్పాటు చేయాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో అధ్యక్షులు ప్రభాకర్, సామర్ధ్య, రజనీకాంత్, కాశీ గల్లా స్వామి, కాశీ గల్ల భరత్,  శ్రావణ్ లక్ష్మణ్, సంతోష్, జేమ్స్ పాల్గొన్నారు.

More articles

Latest article