29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

‘రాస్తారోకో’కు అనుమతిలేదు

Must read

📰 Generate e-Paper Clip

  • ‘చలో ఆర్మూర్’ నేపథ్యంలో సీపీ కల్మేశ్వర్ ప్రకటన
  • నిబంధనలను ఉల్లంఘించొద్దని సూచన

బతుకమ్మ, నిజామాబాద్: రైతులందరికీ రుణమాఫీ కోరుతూ మామిడపల్లి చౌరస్తాలో నేషనల్ హైవే 44పై నిర్వహించ తలపెట్టిన రాస్తారోకో చలో ఆర్మూర్ కార్యక్రమానికి అనుమతి లేదని సీపీ కల్మేశ్వర్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోని ప్రతి ఇంటి నుంచి రెండు చొప్పున ‘చలో ఆర్మూర్’కు తరలిరావాలని బీఆర్ఎస్, బీజేపీ, లెఫ్ట్ పార్టీల నాయకులు పిలుపునిచ్చారని,  శాంతిభద్రతల  పరిరక్షణలో భాగంగా కార్యక్రమానికి అనుమతి ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిషేధం అమలులో ఉంటుందని పేర్కొన్నారు.

More articles

Latest article