29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

’బీఆర్ ఎస్, కాంగ్రెస్ మధ్య క్విడ్  ప్రో కో‘

Must read

📰 Generate e-Paper Clip

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీదే గెలుపు

కేంద్రమంత్రి బండి సంజయ్

నల్గొండ, బతుకమ్మ : బీఆర్ ఎస్, కాంగ్రెస్ మధ్య క్విడ్  ప్రో కో నడుస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై కార్యకర్తలకు ఆయన దిశా నిర్ధేశం చేశారు. తెలంగాణలో జరిగే మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల పోలింగ్ రోజు వరకు ప్రచారం చేయాలని సూచనలు చేశారు. బీజేపీ అభ్యర్థి సరోత్తం రెడ్డి గెలుపునకు కృషి చేయాలని పేర్కొన్నారు. బీఆర్ ఎస్, కాంగ్రెస్ మోస పూరిత హామీలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.

More articles

Latest article