. . . ఖమ్మం జిల్లాలో బాలికపై లైంగిక దాడి యత్నం
వెబ్ డెస్క్, బతుకమ్మ :
ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ రక్షణ సేన పార్టీ ఇన్‌చార్జ్ గౌరవరపు డేవిడ్ రాజ్‌పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆరో తరగతి బాలిక వద్దకు నిందితుడు వెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. లెక్కలు చెబుతానంటూ ఇంట్లోకి ప్రవేశించి బాలికపై లైంగిక దాడికి యత్నించినట్లు బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, నిందితుడు గౌరవరపు డేవిడ్ రాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
