31.8 C
Hyderabad

మన ప్రాణాలు మన చేతిలోనే

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్:   ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని మోర్తాడ్ ఎస్సై విక్రమ్ తెలిపారు. ఆదివారం మోర్తాడ్ మండలంలోని డొంకల్ గ్రామంలో సాయంకాలం స్థానికులతో సమావేశం ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించారు. వాహనదారులు తమ వాహనానికి తప్పకుండా నెంబర్ ప్లేట్లు ఉంచుకోవాలని వాహనాలు నడిపేటప్పుడు సెల్ ఫోన్లు మాట్లాడకూడదని మన ప్రాణాలు మన చేతిలోనే ఉంటాయని జరిగే ప్రమాదాల గురించి స్థానికులకు అవగాహన కల్పించారు. హెల్మెట్ లేని కారణంగా ప్రయాణాలు చేస్తే ఎన్నో ప్రాణాలు హరించుకుపోయాయని పలువురికి వివరించారు. మోర్తాడ్ మండలం ఉన్న ప్రతి గ్రామంలో అవేర్నెస్ ప్రోగ్రాం చేస్తున్నామని తెలియజేశారు. కార్యక్రమంలో పోలీస్ బృందం తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article