31.7 C
Hyderabad

నీటి కుంటలో పడి ఒకరి మృతి

Must read

📰 Generate e-Paper Clip

నాగిరెడ్డిపేట్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలోని తాండూర్ గ్రామానికి చెందిన పల్లె పద్మారావు(43)  అనే వ్యక్తి నీటి కుంట లో పడి మృతి చెందినట్లు ఎస్ ఐ తెలిపారు. గత కొద్ది రోజులు క్రితం పద్మారావు కనిపించక  పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు  ఫిర్యాదు చేశారు. శనివారం అదే గ్రామంలో  నీటి గుంటలో మృతదేహం కనిపించడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందిచారు. కుటుంబ సభ్యుల సమక్షంలో పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కు తరలించినట్లు ఎస్ ఐ తెలిపారు. ఈ మృతికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు.

More articles

Latest article