28.6 C
Hyderabad

పశువుల ఎముకలతో నూనె తయారి

Oil production from animal bones

Must read

📰 Generate e-Paper Clip

 

. . . చీతా ఫోర్స్ దాడిలో బట్టబయలు

 

బోధన్, బతుకమ్మ :

 

బోధన్ పట్టణంలోని గాంధీనగర్ లో పశువుల కొవ్వు, ఎముకలతో నూనె తయారు చేస్తున్నారన్న సమాచారం మేరకు చీతా ఫోర్స్ దాడి చేసింది. నిజామాబాద్ సీపీకి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు చీతాఫోర్స్ పోలీసులు బుధవారం కల్తీ  నూనె తయారి కేంద్రంపై దాడి చేశారు. ఈ దాడిలో పశువుల కొమ్ములు, ఎముకలతో తయారు చేసిన 900 లీటర్ల నూనెను గుర్తించారు. పశువుల ఎముకలతో నూనె తయారు చేస్తున్న షఫీఉద్దీన్, మహ్మద్ సోఫీ ఉద్దీన్, అబ్దుల్ అన్వర్ లను అదుపులోకి తీసుకున్నారు. వారిని బోధన్ పట్టణ పోలీసులకు అప్పగించారు. ఈ దాడిలో చీతా ఫోర్స్ ఎస్సై శ్రీనివాస్, బోధన్ ఎస్సై రాము, సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article