నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నగరంలోని నాందేవ్ వాడలో గల ఎస్సీ స్టడీ సర్కిల్ లో ఆదివారం టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నగర ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో విద్యార్థిని, విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ నగర అధ్యక్షులు నాంది వినయ్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మారం అవిన్, టీఎంఆర్ పిఎస్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ మాదిగ, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజు గగన్, నగర మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ సర్దార్ నరేందర్ సింగ్, శంభుడి గుడి చైర్మన్ మధు పాల్గొన్నారు.
