24.7 C
Hyderabad
Monday, August 3, 2026

గ్రంధాలయ చైర్మన్ ను సన్మానించిన నందిపేట్ కాంగ్రెస్ నాయకులు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నందిపేట్  :                                                                                                                                                                     
నందిపేట్ మండల కేంద్రంలోని గ్రంథాలయాన్ని తొలిసారిగా సందర్శించిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి ని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం ఘన సన్మానం చేశారు. అద్దె భవనంలోనే గ్రంథాలయం కొనసాగుతున్న నందిపేట్ గ్రంధాలయము లొ వసతులు లేక నిరుద్యోగ యువత , స్థానికులు సమస్యలు ఎదుర్కొంటున్నారని వివరించారు. కొత్త భవనం నిర్మాణానికి నిధులు, స్థలం కేటాయించాలని కోరారు.ఈ విషయంపై స్పందించిన చైర్మన్ రాజారెడ్డి వెంటనే జిల్లా కలెక్టర్‌తో చర్చించి, త్వరలో నందిపేట్‌లోనే మంచి మోడల్ గ్రంథాలయం నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మంద మహిపాల్, సీనియర్ నాయకులు పెంట ఇంద్రుడు, కొత్తూర్ రాజేశ్వర్, కిష్టా గౌడ్, మన్పూర్ భూమేశ్వర్, సెలిండర్ లింగం,పీరాజీ నాగరాజ్, కదిర్, సినిగిరి శ్రీను, తమ్మల్లా దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article