27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

నాణ్యత లోపం లేకుండా నిర్మించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి

 

బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణ కేంద్రంలో  రూ.40 లక్షలతో నూతనంగా నిర్మించే సబ్ కలెక్టర్ క్యాంప్ కార్యాలయం, రూ.54 లక్షలతో డీఎస్పీ కార్యాలయాలను నాణ్యత లోపం లేకుండా నిర్మించాలని ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కార్యాలయాల నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్టరుతో వివరాలు తెలుసుకొని నాణ్యత లోపం లేకుండా నిర్మించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాన్సువాడ  డీఎస్పీశ్రీ విఠల్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, బాన్సువాడ పట్టణ స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

More articles

Latest article