27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

దుకాణాలు తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బోధన్ : బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్‌ లోని దుకాణాలను మున్సిపల్ కమీషనర్ జాదవ్ కృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా కమీషనర్ షాప్‌ల అద్దె, లీజు వివరాలను వరుసగా అడిగి తెలుసుకున్నారు. షాపుల ముందు ఏర్పాటు చేసిన అదనపు బండ్లు, తాత్కాలికంగా నిర్మించిన షెడ్లు తొలగించాలని తెలియజేశారు.  గాంధీ పార్క్ నిర్వహణను పరిశీలించి, నిర్వహకుణ్ణి పార్క్ పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. పార్క్‌ కు సంబంధించిన లీజ్ డాక్యుమెంట్లు ఉన్నట్లయితే వాటిని మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

Municipal Commissioner inspects shops

More articles

Latest article