29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఆపత్కాలంలో అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి

Must read

📰 Generate e-Paper Clip

  • అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ ద్వారా వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ

MP Arvind Dharmapuri stands by in times of need

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు‌. ముఖ్యంగా సిరికొండ, ధర్పల్లి, ఇందల్ వాయి మండలాల్లో వర్షాలు, వరదల కారణంగా తీవ్ర నష్టం జరిగింది‌. అయితే, నిరాశ్రయులైన ప్రజలకు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి తన ఫౌండేషన్ ద్వారా అండగా నిలిచారు. వర్షాలు, వరదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు 500 నిత్యావసర కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, మండలాల అధ్యక్షులు, పార్టీ కార్యకర్తల చేతుల మీదుగా నిరాశ్రయులైన ప్రజలకు నిత్యావసర కిట్లను అందించారు‌. ఇలాంటి కష్టకాలంలో అండగా నిలిచిన ఎంపీ అర్వింద్ ధర్మపురి కి ప్రజలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

MP Arvind Dharmapuri stands by in times of need

More articles

Latest article