కేబినెట్ విస్తరణ, పీసీసీ కమిటీల నియామకంపై చర్చలు
హైదరాబాద్, బతుకమ్మ : సీఎం రేవంత్ రెడ్డితో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ శుక్రవారం భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో దాదాపు గంటపాటు వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. తాజా రాజకీయ పరిస్థితులు, కేబినెట్ విస్తరణ, పీసీసీ కమిటీల నియామకంపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
