27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

 ‘సమగ్ర’ ఉద్యోగుల మహార్యాలీ

Must read

📰 Generate e-Paper Clip

Maharyali of 'Comprehensive' employees

బతుకమ్మ, నిజామాబాద్ సిటీ:  విద్యాశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయడంతోపాటు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు దిలీప్ డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం చలో నిజామాబాద్ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఎన్టీఆర్ చౌరస్తా నుంచి కోర్టు చౌరస్తా వరకు శాంతియుత మహార్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చౌక్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా దిలీప్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులందరిని విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని  కోరారు. అప్పటివరకు మినిమం టైం స్కేల్ ను అమలు చేయాలన్నారు. అదేవిధంగా మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని, సుప్రీంకోర్టు  ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్నారు.  దీక్షలో అష్రఫ్ అలీ, సీహెచ్ ప్రసాద్, రాజు, సునంద, విజయ్, సర్వకుమారి, యూసుఫ్ అలీ, స్వప్న, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article