లయన్ విజయానంద్ కు ఎక్సలెంట్ డిస్ట్రిక్ట్ చైర్మన్ అవార్డ్ 

0 8,980

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

లయన్స్ ఇంటర్నేషనల్ నిజామాబాద్ రీజియన్ “సూర్య కిరణాలు” కాన్ఫరెన్స్ లో ఇందూర్ క్లబ్ కు చెందిన  జిల్కార్ విజయానంద్ కు ఎక్సలెంట్ డిస్ట్రిక్ట్ చైర్మన్ అవార్డును ఆదివారం రాత్రి మాధవనగర్ కమ్మ సంఘం లో జరిగిన కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ సూర్యభగవాన్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ విజయలక్ష్మి అందజేశారు. లయన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఘట్టమనేని బాబురావు విజయానంద్ కు ఇంటర్నేషనల్ పిన్ తో సత్కరించారు. 2025- 26 లో నిర్వహించిన డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమాలకు గాను వీరికి అవార్డ్, పిన్ లభించింది. ఈ కార్యక్రమం లో డిస్ట్రిక్ట్ 320 డి కి చెందిన పూర్వ  గవర్నర్లు, లయన్ అధికారులు, వివిధ  క్లబ్బుల అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు.

 

 

Lion Vijayanand gets Excellent District Chairman Award

Leave A Reply

Your email address will not be published.