25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

జన విజ్ఞాన వేదిక తెలంగాణ జిల్లా కమిటీ ఎన్నిక

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : జన విజ్ఞాన వేదిక తెలంగాణ జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు గౌరవ అధ్యక్షులు చెలిమల రాజేశ్వర్ తెలిపారు. జిల్లా కేంద్రంలో గల జిల్లా గ్రంథాలయ భవనంలో సీనియర్ న్యాయవాది బాసరాజేశ్వర అధ్యక్షతన జన విజ్ఞాన వేదిక తెలంగాణ ఐదవ మహాసభలను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాబోయే రెండు సంవత్సరాలకు జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా బాసరాజేశ్వర్, చెలిమెల రాజేశ్వర్, అధ్యక్షులుగా కె. ఓమర్ అలీ, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ పులి జైపాల్, కోశాధికారిగా కల్గే పండరిని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా చెలిమిల పద్మ, సుజన, ఎమ్మెస్ శ్రీహరి ఆచార్య, తొక్కడి నారాయణ, నరసయ్య లను ఎన్నుకున్నారు. కార్యదర్శులుగా డాక్టర్ కవిత, డి, సంజీవ్, జె. నర్సాగౌడ్, ధర్పల్లి సాయికుమార్, బి. ఆకాశలను ఎన్నుకున్నారు.

Jan Vigyan Vedika Telangana District Committee Election

More articles

Latest article