డ్రంక్ అండ్ డ్రైవ్ లో జైలు, జరిమానా

0 1,266

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : అతిగా మద్యం తాగి వాహనం నడిపి పట్టుబడిన 18మందికి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ బుధవారం జైలు శిక్ష, జరిమాన విధించినట్లు ట్రాఫిక్ సీఐ ప్రసాద్ తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 18మందిని బుధవారం కౌన్సిలింగ్ నిర్వహించి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచినట్లు తెలిపారు. వీరిలో 15 మందికి రూ.36,200 జరిమానా, కోటగల్లికి చెందిన ఎస్.శ్రీనివాస్, నిర్మల్ కు చెందిన ఎం.రాజేష్, ఖిల్లా రోడ్ కు చెందిన ఎండీఅఖిల్ లకు రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.