28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఇందల్వాయి ఆర్టీసీ బస్టాండ్ అంటే అంత చులకననా..?

Must read

📰 Generate e-Paper Clip

  •  శాశ్వత పరిష్కారం దొరికేనా..?
  • కనీస సౌకర్యాలు కల్పించండి సార్లూ..
  • నిలిచిన వర్షపు నీటితో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు

 

ఇందల్వాయి, బతుకమ్మ: ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికులు నిత్యం వేల సంఖ్యలో ప్రయాణం కొనసాగిస్తుంటారు. కానీ ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం వల్ల వర్షపు నీరు నిల్వ కావడంతో ప్రయాణికులకు రాకపోకులకు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ప్రమాదాలకు దారితీస్తుందనీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ద్విచక్ర వాహనదారులు పెద్ద మొత్తంలో వర్షపు నీరు నిల్వ కావడంతో గాయాలపాలైన సందర్భాలు ఉన్నాయి.  కానీ ఇప్పటివరకు ఆర్టీసీ యాజమాన్యం స్పందించకపోవడం ఆ యొక్క నీరు నిల్వ ఉండకుండా చేయడంలో విఫలం అవడంతో ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బంది పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సౌకర్యాలకు సహకరించని ఆర్టీసీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ సిబ్బంది నిద్రమత్తులో నుండి తేరుకొని వర్షపు నీటి నిల్వకాకుండా నీరును డైవర్షన్ ద్వారా తొలగించేలా సత్వరమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ యజమాన్యం తేరుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే.

Is the Indalvai RTC bus stand really that small?

More articles

Latest article