రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలంలోని అంబం (ఆర్) గ్రామంలో మోడల్ స్కూల్ లో చదివిన చుంచు సాహితి బాసర ఐఐఐలో సీటు సాధించిన సందర్భంగా హెల్పింగ్ హాండ్స్ మిత్రబృందం ఆధ్వర్యంలో సోమవారం సాహితిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు మాట్లాడుతూ.. విద్యార్థి సాహితీని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడి చదువుతూ ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేయాలని కోరారు.
