29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

చందూర్ లో మొదలైన హోలీ సంబురాలు

Must read

📰 Generate e-Paper Clip

 

చందూర్, బతుకమ్మ :

 

చందూరు మండల కేంద్రంలో ప్రధాన కూడలి వద్ద ఆదివారం కారేగాం తాండా గిరిజనులు సాంప్రదాయ కోలాటాలు నిర్వహించారు. హోలీ పండుగకు ముందు రోజు తాండాలలో లెంగి వేయడం ఆనవాయితీగా కొనసాగుతోందని కారేగాం తాండా సర్పంచ్ డాక్టర్ రామావత్ లాల్ సింగ్ తెలిపారు. ఈ కోలాటాలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గిరిజనుల సంప్రదాయ వేషధారణ, ఉత్సాహభరిత నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మండల అధ్యక్షుడు చత్రు సింగ్ చందూర్ సర్పంచ్ మాధవ రెడ్డి, మాజీ సర్పంచ్ సాయిరెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ చంద్రు నాయక్, నాయక్ రాం బాబు, కార్బారి దళ్ సింగ్, దేవి సింగ్ , అంబర్ సింగ్  గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

 

Holi celebrations begin in Chandur

 

More articles

Latest article