27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

గురుకులాల టైమింగ్ మార్చాలి

Must read

📰 Generate e-Paper Clip

  • తెలంగాణ గురుకుల ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వసంత్ రావు

 

నిజామాబాద్ సిటీ,  బతుకమ్మ : గురుకులాల టైమింగ్ మార్చాలని పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ను తెలంగాణ గురుకుల ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వసంత్ రావు కోరారు. నగరంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో పీసీపీ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే మహేష్ కుమార్ గౌడ్ కు శనివారం ఆయన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అన్ని గురుకుల పాఠశాలల్లో టైం టేబుల్ ను ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4వరకు మార్చాలని కోరారు. దాదాపు అన్ని గురుకుల పాఠశాలలు అద్దె భవనాలలో నడుస్తున్నాయని, వాటిలో సరైన సదుపాయాలు లేక సమస్యలతో పాఠశాలలను నడపాల్సి వస్తుందన్నారు. దీని వల్ల విద్యార్థులకు సౌకర్యాలు లేకి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.  దూరం నుంచి వచ్చే మహిళలకు రవాణా సదుపాయం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. టైమింట్ మార్చడం వల్ల విద్యార్థులకు, మహిళా ఉద్యోగులకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. గురుకులాల్లో ఉద్యోగులకు జీతాలు సమయానికి రావడం లేదని, 010 హెడ్ ప్రకారం జీతాలు చెల్లించాలని కోరారు. టీచర్లకు నైట్ స్టే ఎత్తివేయాలని, ఒకేరకమైన స్టాఫ్ ప్యాట్రన్ ఉండాలని అన్నారు. అన్ని గురుకులాల్లో డిప్యూటీ వార్డెన్ లను నియమించి ఉపాధ్యాయులను కేర్ టేకర్ బాధ్యతల నుంచి విముక్తి కలిగించాలని కోరారు. దీనికి మహేష్ కుమార్ గౌడ్ సంబంధిత సెక్రెటరీ, చీఫ్ సెక్రెటరీ తో మాట్లాడి విద్యార్థులకు, ఉద్యోగులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

More articles

Latest article