27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ధాన్యం, మక్క కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

నందిపేట్, బతుకమ్మ :  నందిపేట్ మండలం కుద్వాన్ పూర్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం,  మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని  పీఏసీఎస్ చైర్మన్ వాకిడి కార్తీక్ రెడ్డి,ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు బైండ్ల ప్రశాంత్ లు శుక్రవారం ప్రారంభించారు.  ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్టంలో ప్రతి మొక్కజొన్న గింజను, ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు.  రైతులు దళారుల  మాయలో పడకుండా   కొనుగోలు కేంద్రాలలో పంట ను అమ్మి మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. ఈకార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు పాల్గొన్నారు.

More articles

Latest article