25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

గౌడ విద్యార్థిని, విద్యార్థులు ఉన్నత స్థానాల్లో నిలవాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . జై గౌడ ఉద్యమం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వట్టికూడి రామారావు గౌడ్

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

గౌడ సమాజ అభ్యున్నతికి విద్యే ప్రధాన ఆయుధమని, గౌడ విద్యార్థిని విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని జై గౌడ ఉద్యమం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వట్టికూడి రామారావు గౌడ్ పిలుపునిచ్చారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన గౌడ విద్యార్థిని విద్యార్థులను సన్మానిస్తూ కామారెడ్డి పట్టణంలోని కర్షక్ బిఈడి కళాశాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించిన “ప్రతిభ పురస్కారాల అవార్డుల కార్యక్రమం”లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి యువత విద్యలో రాణించి ఉన్నత స్థానాలకు చేరుకుంటేనే గౌడ సమాజానికి గౌరవం పెరుగుతుందని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉన్నత పదవులు సాధించాలని సూచించారు. గౌడ సమాజంలోని ప్రతి కుటుంబం తమ పిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులను శాలువాలు, మెమెంటోలు అందజేసి ఘనంగా సన్మానించారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు గౌడ కుల చరిత్ర, గొప్పతనం, సంస్కృతి, సంప్రదాయాల గురించి విశదీకరించారు.

 

Gowda students should be in high positions

 

కౌండిన్య మహర్షి మహాత్మ్యం, గౌడ కులదేవతల వైభవం, వీరశూరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన త్యాగాలు, సమాజ సేవలను స్మరించుకున్నారు. పాపన్న గౌడ్ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా విద్యార్థులను ఉన్నత చదువులు చదివిస్తున్న తల్లిదండ్రుల కృషిని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో జై గౌడ ఉద్యమం రాష్ట్ర అధ్యక్షుడు గుండ్రాతి నారాయణ గౌడ్, అధికార ప్రతినిధి దత్తాత్రి గౌడ్, యూత్ అధ్యక్షుడు క్రాంతి కుమార్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర యూత్ విభాగం అధ్యక్షులు బొమ్మగోని శంకర్ గౌడ్, కేశవ్ గౌడ్, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంగోళ్ళ మురళి గౌడ్, ప్రధాన కార్యదర్శి అంకన్నగారి శ్రీనివాస్ గౌడ్, పెద్ద మల్లారెడ్డి సొసైటీ చైర్మన్ రాజా గౌడ్, ఇందూరి సిద్ధా గౌడ్, కర్రోల్ల శేఖర్ గౌడ్, బొంబోతుల నరేష్ గౌడ్, ప్రకాష్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, ప్రశాంత్ గౌడ్, సుదర్శన్ గౌడ్, రామా గౌడ్, సురేష్ గౌడ్, దేవేందర్ గౌడ్ లతో పాటు భారీ సంఖ్యలో గౌడ సోదర సోదరీమణులు, విద్యార్థులు పాల్గొన్నారు.

 

Gowda students should be in high positions

More articles

Latest article