జిల్లా జడ్జిని కలిసిన గౌడ, అంబేడ్కర్ సంఘం నాయకులు

0 14,545

ఆర్మూర్, బతుకమ్మ: నిజామాబాద్ పట్టణంలో జిల్లా జడ్జి ఉదయ భాస్కర్ ను గురువారం గౌడ సంఘం, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు  మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఇత్వర్ పేట్ లింగన్న మోర్తాడ్ మండల అధ్యక్షులు అంగుళి మాలజీ  వెళ్లి జడ్జి గారితో కలిసి పలు విషయాల గురించి చర్చించారు. సంఘ హక్కులు, సమస్యల పరిష్కారానికి న్యాయపరంగా సహకారం అందించాలంటూ జడ్జిని కోరారు. అలాగే అంబేద్కర్ సంఘం నాయకులు సామాజిక న్యాయం,సమానత్వం కోసం అందరూ కలసి ముందుకు సాగాలని సూచించారు. ఈ సందర్భంగా స్థానికంగా గౌడ సంఘం, అంబేద్కర్ సంఘం నాయకులు పలు అంశాలపై చర్చ జరిపారు.

Leave A Reply

Your email address will not be published.