మద్నూర్, బతుకమ్మ: ఉత్తమ సేవలకు గాను ఉత్తమ ఉద్యోగిగా మద్నూర్ మండల గిర్ధవర్ ఎం శంకర్ ని జిల్లా కలెక్టర్ ఎన్నిక చేశారు. ఆదివారం గణతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. ఉత్తమ ఉద్యోగిగా తమ సేవలను గుర్తించి ఎన్నిక చేసినందుకు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, సబ్ కలెక్టర్, మండల తహసీల్దార్ గార్లకు గిర్ధవర్ ఎం శంకర్ కృతజ్ఞతలు తెలిపారు.
