. . . మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుతూ అభివృద్ధి దిశగా ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల పిలుపునిచ్చారు. శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిజామాబాద్ నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ బిగాల నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎల్లమ్మగుట్టలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి తో కలిసి గణేష్ బిగాల జాతీయ జెండాను ఆవిష్కరించారు.

అనంతరం ఆర్ఆర్ చౌరస్తా శివాజీ చౌక్‌లో సిర్ప రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. తదుపరి జూబ్లీ హోటల్ చౌరస్తా, ఖిల్లా రోడ్లో బీఆర్ఎస్ నాయకులు అబ్దుల్ మతీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే 58వ డివిజన్ అధ్యక్షులు సమీ ఆధ్వర్యంలో దారుగల్లిలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం 15వ డివిజన్ బీఆర్ఎస్ నాయకులు ముస్తాక్ ఆధ్వర్యంలో నిజాం కాలనీ మెయిన్ రోడ్, అర్సపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనూ గణేష్ బిగాల జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ప్రతినిధులు, స్థానికులు తదితరులు పాల్గొని జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు.

