బతుకమ్మ మోర్తాడ్: పోటీ ప్రపంచంలో ప్రతినిత్యం విద్యార్థి తరగతి పాఠ్యపుస్తకాల విషయాలతో పాటు నూతన విషయాలు నేర్చుకోవడంలో కూడా ఆసక్తితో ఉండాలని పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు సంతోష్ కుమార్ అన్నారు. మోర్తాడ్ మండలంలోని సుంకేట్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను 6,7, 8, 9 తరగతులలో మంచి ప్రతిభ చూపించి, అధిక మార్పులు సాధించిన విద్యార్థులకు మంగళవారం బంగారు పతకం, వెండి పతకం, రాగి పథకాలను అందజేశారు అలాగే పథకాలతో పాటు ప్రత్యేక బహుమతులను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులను సైతం శాలువాలతో ఘనంగా సన్మానించడం జరిగింది. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుల బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

