బతుకమ్మ, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు: పచ్చని అందాల మధ్యలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ సుందర దృశ్యం. మరోపక్క గోదావరి పరవళ్ళు, కాలువల ప్రవాహాలు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ జల దృశ్యాలు వీటన్నిటిని తిలకించడానికి వారాంతములో ఆటవిడుపుగా ఆదివారం అధిక సంఖ్యలో పర్యాటకులు రావడంతో ప్రాజెక్ట్ పర్యాటకులతో ఒక ప్రత్యేక పర్యాటక శోభన సంతరించుకుంది. నీటి తుప్పర్లు పైన పడుతుంటే యువకుల కేరింతలు చిన్నపిల్లల ఆటలు ప్రత్యేకంగా ఆకర్షణ గా కనిపించాయి. దీంతో పర్యాటకులు తమ చరవాణిలకు పని చెప్పారు. తమ కెమెరాలో ప్రాజెక్టు అందాలను, నీటి ప్రవాహం అందాలను బంధిస్తూ ఒకరు. ప్రాజెక్టు వద్ద సెల్ఫీ దిగుతూ మరొక్కరు. కొందరు కుటుంబ సమేతంగా చిన్న పెద్ద అందరు నీటిలో ఆడుకుంటూ సంతోషంతో గడుపుతూ సేద తీరారు. యువకులు చేపల వేట చేస్తు ఆళ్లదంగా గడిపినారు.

