25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

డబుల్ బెడ్ రూం లబ్ధిదారుల కష్టాలు తీరుస్తా

Must read

📰 Generate e-Paper Clip

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి  గ్రామ సర్పంచిగా లోకని గంగామణా గంగారం గురువారం భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈసందర్భంగా  డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్ధిదారులు నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఉప సర్పంచ్,వార్డ్ మెంబర్లను పూలమాలలతో ఘనంగా సన్మానించారు.తాము నివసిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు ఇప్పటివరకు ఇంటి పత్రాలు,ఇంటింటికి మీటర్లు, ఇవ్వలేదని వారి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే కాలనీలో రెండు కొత్త బోర్లు వేయించి తమ సమస్యలు తీర్చాలని కోరారు. డ్రైనేజీ వ్యవస్థను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు.దీంతో స్పందించిన సర్పంచ్ మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ల్లో  నివసిస్తున్న కుటుంబాల అందరికీ ఇంటి నియామక పత్రాలతో పాటు  కాలనీని అన్ని విధాల అభివృద్ధి జరిగేలా చూస్తామనీ కాలనీవాసులకు హామీ ఇచ్చారు. దీంతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జెగ్గ గంగాదాసు,సూకూరు రాజయ్య,రాంబాబు, కాలనీవాసులు తదితరులు ఉన్నారు.

More articles

Latest article