భీమ్ గల్, బతుకమ్మ : అంకం జ్యోతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం వృద్దులకు, పిల్లలకు దుప్పట్లు, స్వేట్టర్లను పంపిణి చేశారు.భీమ్ గల్ పట్టణానికి చెందిన అంకం జ్యోతి, ఆమె భర్త సంతోష్ కుమార్లు గత 15 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ ట్రస్ట్ ద్వారా చాలా సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సేవ కార్యక్రమం లో భాగంగా చలికి వణుకుతున్న వృద్దులకు దుప్పట్లను, పిల్లలకు స్వటర్లను పంపిణి చేశారు. ఈ దుప్పట్లు, స్వేటర్ల పంపణికి గాను లండన్ లో ఉన్న తన తమ్ముడు వెంకటేష్ స్పాన్సర్ గా నిలిచారని ఆమె తెలిపారు.