31.5 C
Hyderabad

బాధిత కుటుంబాలను పరామర్శించిన డీసీసీ అధ్యక్షులు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రమాదంలో మృతి చెందిన షేక్ ఖలీమ్, అజీమ్, నజువత్ కుటుంబ సభ్యులను నిజామాబాద్ డీసీసీ కార్పొరేషన్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ మంగళవారం పరామర్శించారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఘటన వివరాలను టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌కు ఫోన్ ద్వారా వివరించి, ఆయనను బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడించారు. ఫోన్‌లో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్, మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, కష్టకాలంలో వారికి అండగా ఉంటామని తెలిపారు. ఈ పరామర్శ కార్యక్రమంలో ప్రీతం, ముస్తఫా, వహీద్, హర్షద్, గోవర్ధన్, షమీ, అయుబ్, షోయబ్, జఫర్, షకీల్, అఫ్ఫాన్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

 

DCC Presidents console affected families.

More articles

Latest article