28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ కార్మికుల ఆందోళన

Must read

📰 Generate e-Paper Clip

  • బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్

 

రుద్రూర్ (వర్ని), బతుకమ్మ : మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల మూడు నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ, బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు. అనంతరం వైద్యాధికారిని పద్మజకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకుడు నన్నేసాబ్, కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ యూనియన్ అధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ..మూడు నెలలుగా వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెల ఒకటవ తారీఖున వేతనాలు చెల్లించేలా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో దేవి సింగ్, గంగాధర్, సుమన్, మాధవి, నర్సింగ్, సాయిలు, దీపక్, చింటూ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article