29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

పేకాట స్థావరం పై సీసీఎస్ టీం దాడి

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

రెంజల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసులు దాడులు నిర్వహించారు. సోమవారం నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు సీసీఎస్ సీఐ సురేష్ ఆధ్వర్యంలో సీసీఎస్ సిబ్బంది రెంజల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔట్స్ కట్స్ లో పేకాట స్థావరం పై రైడ్ చేసి తొమ్మిది మంది పేకాట రాయుళ్ళను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 4 సెల్ ఫోన్, 6 బైక్ లు, 2 కార్లు, రూ. 42,490 లను స్వాధీనం చేసుకొన్నారు. తదుపరి చర్యల నిమిత్తం రెంజల్ పోలీస్ స్టేషన్  ఎస్ హెచ్ వో కి అప్పగించారు.

More articles

Latest article