నిజామాబాద్ సిటి, బతుకమ్మ : జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్ ల దిష్టిబొమ్మలను ఆదివారం ధర్నాచౌక్ లో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణులు మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశంలో అసెంబ్లీ దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు కేటీఆర్ ,జగదీశ్ రెడ్డిల దిష్టిబొమ్మలు దగ్ధం చేశామన్నారు. గత పది సంవత్సరాల కాలంలో కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీ దళితులను, గిరిజనులను, బీసీలను అవమానిస్తూనే ముందుకు వెళ్లిందని, ప్రస్తుతం అసెంబ్లీలో కేటీఆర్ బరితెగించి తన ఎమ్మెల్యేలతో కలిసి దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మున్ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే గుణపాఠం చెప్తామని, దళితులు గిరిజనులు మీ అంతు చూస్తారని హెచ్చరించారు. ఖబడ్దార్ కేటీఆర్ గత 14 నెలలుగా అధికారం పోయిన నుండి కేటీఆర్ మాట్లాడుతున్న మాటలు అందరినీ అవమానించేలా ఉన్నాయని, మీ శాసనసభ్యుడు స్పీకర్ ను అవమానించి మాట్లాడితే దానిని నువ్వు సమర్థించడం అనేది కెసిఆర్ నుండి నీకు వచ్చిన దొర అహంకారమేనని,రాబోయే కాలంలో దళితులు గిరిజనులు మిమ్మల్ని మరింత పాతాళానికి తొక్కుతారని, వెంటనే స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీష్ రెడ్డి దానిని సమర్థించిన కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బీన్ హంధాన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డీ రాజారెడ్డి, ఎన్ ఎస్ యుఐ ప్రధాన కార్యదర్శి వేణు రాజ్ తదితరులు పాల్గొన్నారు.
