29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

వేల్పూర్ లో బోనాల పండగ

Must read

📰 Generate e-Paper Clip

వేల్పూర్, బతుకమ్మ : ఆషాడ శుద్ధ ఆదివారం మండల కేంద్రంలో బోనాల సందడి నెలకొంది. ఈ బోనాల సందర్బంగా గౌడ్ సంఘం ఆధ్వర్యంలో రేణుక ఎల్లమ్మ ఉత్సవమూర్తులను పల్లకిలో ఉంచి ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపుతో పాటు అమ్మవారికి బోనాలు సమర్పించి, నైవేధ్యాన్ని నివేదించారు. మండల కేంద్రంలో గౌడ్ కులస్థులతో పాటు పలు కుల సంఘాలు బోనాల పండగను నిర్వహించి, వర్షాలు కురువాలని గ్రామ దేవతలకు గంగజాలంతో అభిషేకం నిర్వహించారు. గ్రామ దేవతలకు జంతు బలినిచ్చి మొక్కులు తీర్చుకొన్నారు. ఈ సందర్బంగా వనబోజనాలకు వెళ్లారు.

More articles

Latest article