–ఇందల్వాయి గ్రామానికి అరుదైన గౌరవం
ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండలం ఇందల్వాయి గ్రామానికి చెందిన తోట లావణ్య చిన్న రాజన్నలకు ఆర్మూర్ డివిజన్లో కోళ్ల పెంపకంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండవ స్థానంలో నిలవడం చాలా గొప్ప విషయమని డివిజన్ మేనేజర్ పేర్కొన్నారు.ఈ మేరకు బుధవారం తోట లావణ్య కు ద్వితీయ శ్రేణి బహుమతిని అందించారు. వ్యాపారంలో మహిళా మణులు రాణించాలన్నారు.ప్రతి ఒక్కరు వ్యవసాయంతో పాటు వ్యాపార రంగంలో రాణించి స్వ శక్తితో రాణించినప్పుడే మహిళలు అభివృద్ధి చెందుతారన్నారు.ఈ కార్యక్రమంలో సుగుణ కోళ్ల ఫారం డివిజన్ మేనేజరు. జిల్లా మేనేజరు.గ్రామ మాజీ సర్పంచ్. మాజీ ఎంపీటీసీ. సింగిల్విండో చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.
