26.2 C
Hyderabad
Monday, August 3, 2026

పాపన్న గౌడ్ కు నివాళులు అర్పించిన బీసీ సంఘం నాయకులు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ :  నగరంలోని  వినాయక్ నగర్ హనుమాన్ జంక్షన్ వద్ద గల విగ్రహాల పార్కులో గల సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బహుజన ధీరత్వానికి ప్రతీక అని అన్నారు. సర్వాయి పాపన్న పోరాట స్ఫూర్తితో బహుజనులు అందరి ముందుకు సాగి తమ హక్కులను సాధించుకోవాలన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు కావాలంటే బీసీ కులాలు అన్ని ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  నరాల సుధాకర్, దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, చంద్రమోహన్, గూపన్ పల్లి శంకర్, గంగాకిషన్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article