25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

డీజే సప్పుల్లు లేకుండా బతుకమ్మ సంబరాలు

Must read

📰 Generate e-Paper Clip

  • మహిళలు స్వయంగా ఆడి పాడారు

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : బతుకమ్మ పండగ అంటేనే డిజే సప్పుల్లు, హోరెత్తించే సౌండ్ మనం ప్రతి ఊరిలో చూసే బతుకమ్మ పండగ. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో అందుకు వినూత్నంగా పాత సంప్రదాయ పద్ధతిలో పాటలు పాడుతూ మహిళలు బతుకమ్మ సంబరాలు చేసుకున్నారు. వాడి విడిసి చైర్మన్ జిన్నా సాయిలు సభ్యులు ఆధ్వర్యంలో పండగ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. మహిళలు అందంగా ముస్తాబు అయ్యి, బతుకమ్మ లను తీసుకువచ్చి గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద బతుకమ్మ చుట్టూ ఆడి పాడారు. అనంతరం మర్రి చెట్టు కింద , బ్రిడ్జి వద్ద ఆడి వాడి వాగులో నిమర్జనం చేశారు. ప్రసాదాలు పంచుకున్నారు. ఇంటి నుంచి తెచ్చుకున్న ఆహార పదార్థాలు బంధు మిత్రులతో తింటూ సంతోషంగా గడిపారు.

More articles

Latest article