సూర్యపేట, బతుకమ్మ : సూర్యాపేటలో ఎస్బీ విభాగంలో ఏఎస్సైగా పని చేస్తున్న గోపగాని సత్యనారాయణ గౌడ్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సూర్యపేట జిల్లా కేంద్రంలోని ఓ గేటేడ్ కమ్యూనిటీలోని తన ఇంట్లో ఏఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సత్యనారాయణగౌడ్ సూర్యాపేట జెడ్పీ మాజీ వైస్ ఛైర్మన్ వెంకట్ నారాయణ గౌడ్ సోదరుడు కావడం గమనార్హం. ఆయన మృతితో తోటి సిబ్బంది, ఉన్నతాధికారులు సంతాపం తెలిపారు.
