27.3 C
Hyderabad
Friday, July 31, 2026

మద్యం సేవించి వాహనం నడిపిన ముగ్గురికి రెండ్రోజుల జైలు శిక్ష

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నిజామాబాద్ సిటి : మద్యం సేవించి వాహనం నడిపిన 15 మందిని ట్రాఫిక్ పోలీసులు కోర్టులో హాజరుపర్చగా వారిలో 12 మందికి జరిమానా విధించగా ముగ్గురికి రెండు రోజుల పాటు జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ ఏసీపీ నారాయణ తెలిపారు. బుధవారం రాత్రి నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా 15 మంది మద్యం సేవించి వాహనాలు డ్రైవింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. వారిని గురువారం కోర్టులో హాజరుపర్చగా 12 మందికి రూ.31,500 జరిమానా విధించగా ముగ్గురికి 2 రోజుల పాటు జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ ఏసీపీ తెలిపారు.

More articles

Latest article