రామారెడ్డి, బతుకమ్మ : రామారెడ్డి మండలంలోని పోసానిపేట గ్రామంలో రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్లు రామారెడ్డి ఎస్ఐ రాజారాం తెలిపారు. పోసానిపేట గ్రామానికి చెందిన బెస్త బలరాం ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు. దొంగలు మూడు తులాల బంగారం, 15 తులాల వెండి దొంగిలించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

