26.3 C
Hyderabad
Monday, August 3, 2026

అర్హులందరికీ లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ ధ్యేయం

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ : అర్హులందరికీ లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా గ్రంథాలయసంస్థ మాజీ చైర్మన్ మార చంద్రమోహన్ అన్నారు. ఆర్మూర్  మండలంలోని చేపూర్, పల్లె రెండు గ్రామాలలో  శుక్రవారం ప్రజా పాలన  గ్రామ సభలు గ్రామ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ లక్కం ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  గ్రామ సభలో చదివి వినిపించిన పేర్లు ముసాయిదా  జాబితా మాత్రమేనని ఇందులో అనర్హులు ఉంటే వారి పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించబడుతుందని అన్నారు. ఎవరైనా అర్హులు మిగిలి ఉంటే వారి నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

More articles

Latest article