నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో గురువారం నుండి పీజీ ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఏపీఈ, ఐఎంబీఏ, ఐపిసిహెచ్ ఆరవ, ఎనిమిదవ, పదవ సెమిస్టర్ రెగ్యులర్, థియరీ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కాలేజీలో జరిగిన పరీక్షలను వైస్- ఛాన్స్లర్, ఆచార్య టీ.యాదగిరి రావు, రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి ఆకస్మిక తనిఖీ చేసి పరీక్షల ఏర్పాట్ల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. తనిఖీలో ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్,ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణ్ మామిడాల, డైరెక్టర్ ( పి ఆర్ ఓ ) ఏ పున్నయ్య అడిషనల్ కంట్రోలర్ డా. టి. సంపత్ లు పాల్గొన్నారు.
