నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : వైద్య, ఆరోగ్యశాఖ మినిస్టీరియల్ ఉద్యోగుల ఫోరం సభ్యులు టీఎన్జీవో సభ్యత్వాన్ని స్వీకరించారు. ఫోరానికికు ఎన్నికలు నిర్వహించాలని శుక్రవారం టీఎన్జీవో జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీఎన్జీవో అధ్యక్ష కార్యదర్శులు నాశెట్టి సుమన్ కుమార్, నేతికుంట శేఖర్ ను ఘనంగా సన్మానించి ఉద్యోగుల సమస్యలు విన్నవించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా సంయుక్త కార్యదర్శి జాఫర్ హుస్సేన్, అర్బన్ యూనిట్ అధ్యక్షులు జాకీర్ హుస్సేన్, వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు సూర్యనారాయణ, హనుమాన్లు, జగదీష్, గణేష్, వంశీకృష్ణ, వినీత్ తదితరులు పాల్గొన్నారు.
