29 C
Hyderabad
Monday, August 3, 2026

శ్రీ విఠలేశ్వర స్వామి ఆలయంలో సీనియర్ సివిల్ జడ్జీ ప్రత్యేక పూజలు

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ విఠలేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ పి. పద్మావతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలోని శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి వారికీ పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ నిర్వాహకులు జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ పి. పద్మావతిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి నారాయణ కులకర్ణి శర్మ, రాము శర్మ, ఆలయ కమిటీ నిర్వాహకులు కర్క అశోక్, గంగాధర్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article