24.7 C
Hyderabad
Monday, August 3, 2026

గాయపడిన వ్యక్తిని అంబులెన్స్ లో తరలించిన పోలీస్ కమిషనర్

Must read

📰 Generate e-Paper Clip

డిచ్ పల్లి, బతుకమ్మ : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని హుటాహుటిన అంబులెన్స్ లో తరలించి పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మానవత్వాన్ని చాటుకున్నారు. బుధవారం మధ్యాహ్నం సమయంలో డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నడిపల్లి గ్రామ శివారులో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న అశోక్ గాబ్రీ (35) అనే వ్యక్తి అదుపుతప్పి  రోడ్డు ప్రక్కన పడి పోయారు. ఆ వ్యక్తికి తలకు బలమైన గాయాలు అయి తీవ్రంగా రక్తస్రావంతో బాధపడుతున్న వ్యక్తిని అటువైపు నుంచి వెళుతున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య గమనించి తన కారు ఆపి ఆ వ్యక్తిని పరామర్శించి అంబులెన్స్ కు ఫోన్ చేసి అంబులెన్స్ లో ఆ వ్యక్తిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా డిచ్పల్లి ఎస్సై ఎం.డి షరీఫ్,పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

More articles

Latest article