27.5 C
Hyderabad
Friday, July 31, 2026

పాదయాత్రలు కాదు.. ప్రజలకిచ్చిన హామీలు ఏమయ్యాయి

Must read

📰 Generate e-Paper Clip

  • రైతు, యూత్, బీ సీ డిక్లరేషన్ల పై మీనాక్షి నటరాజన్ క్లారిటీ ఇవ్వాలి
  • ఒక్కొక్క డిక్లరేషన్ ఒక్కక్క కాంగ్రెస్ వి వి ఐ పీ లు ఇచ్చిన హామీలేమయ్యాయి
  • మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

 

నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : అధికారం ఛేజిక్కించుకొనేందుకు అప్పుడు పీ సీ సీ ప్రెసిడెంట్ హోదాలో సీ. ఎం రేవంత్ రెడ్డి అమలుకు సాధ్యం కానీ హామీలిచ్చి, ఇచ్చిన హామీలను సంపూర్ణంగా అమలు చేయకుండానే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ జిల్లాలో పాదయాత్ర నిర్వహించడం శోచనీయమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియా తో మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి చెబితే రాష్ట్ర ప్రజలు నమ్మరని కేంద్రం నుండి వి వి ఐలను రప్పించి రాష్ట్ర రైతులకు, యూత్ కు, బీ సీ లకు ఇచ్చిన డిక్లరేషన్ల సంగతిని ఆయన గుర్తు చేశారు. వరంగల్ లో రాహుల్ గాంధీ ఇచ్చిన రైతు డిక్లరేషన్, ప్రియాంక గాంధీ యూత్ కు ఇచ్చిన డిక్లరేషన్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ది రామయ్యలు ఇచ్చిన బీసీ డిక్లరేషన్ల గురించి వివరించారు. వరంగల్ రైతు డిక్లరేషన్ కు రాహుల్ గాంధీ వచ్చి రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారని, ఇప్పటికి సగం మందికి కూడా రూ.2 లక్షల రుణమాఫీ  కాలేదని, కేవలం నిజమాబాద్ జిల్లాలో సుమారు 2 లక్షల 3 వేల మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉండగా, కేవలం 1 లక్ష 3 వేల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయ్యిందన్నారు.మిగతా లక్ష  రైతులకు కాలేదని,జిల్లాలో ఇంకా లక్ష మంది రైతులకు  రూ.2 లక్షల ఋణామాఫీ అంటే సుమారు రూ.2000 కోట్లు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బాకీ పడిందన్నారు. అప్పుడు అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి మాట మార్చి సన్న వడ్లకు అంటున్నారన్నారు. బోనస్ ఇచ్చినారా ? నిజామాబాద్ జిల్లాలో ప్రతి పంట కు సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల  కొనుగోలు చేస్తున్నారు,ఒక్క సీజన్  కు 8 లక్షల మెట్రిక్ టన్నుల పంటకు క్వింటాలుకు రూ. 500 బోనస్ చొప్పున  రూ.400 కోట్లు రైతులకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మీరు అధికారం లోకి వచ్చిన తర్వాత 3 సీజన్ లకు కలిపి బోనస్ రూ.1200 కోట్లు ఇవ్వాల్సీ ఉండగా కేవలం రూ. 200 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. వడ్ల బోనస్ కింద జిల్లా రైతులకు ఇంకా రూ.1000 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందన్నారు. కేసీఆర్ రైతు బంధు బిచ్చం వేసినట్లు పంటకు ఎకరానికి రూ. 5000 ఇస్తున్నాడని,అది రెండు పంటలకే  వేస్తున్నాడని, మూడో పంటకు ఇవ్వట్లేదని అప్పుడు  రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను ఎమ్మెల్యే గుర్తు చేశారు. వరంగల్ డిక్లరేషన్ లో రేవంత్ రెడ్డి ప్రతి ఎకరానికి సంవత్సరానికి రూ.15000 రైతు భరోసా వేస్తా అన్నాడని, ఒక సీజన్ లో కేసీఆర్ ఇచ్చిన విధంగా రూ.5000 చొప్పున వేసి రూ.2500 రైతులకు ఎగ్గొట్టారని,రెండో  సీజన్ లో మొత్తం ఎగ్గొట్టి, మూడో సీజన్ లో 4 ఎకరాల పైన ఉన్న రైతులకు ఎగ్గొట్టారన్నారు. మొన్న సీజన్ ఎన్నికలు ఉంటాయని ఇచ్చిన మాట ప్రకారం కాకుండా రూ. 12000 చొప్పున రైతు భరోసా వేశారని.నిజామాబాద్ జిల్లాలో సుమారు 5 లక్షల 60 ఎకరాల సాగు విస్తీర్ణం ఉందని.మీరు రైతు డిక్లరేషన్ లో మాట ఇచ్చిన ప్రకారం చూసైనా.. జిల్లా ప్రజలకు 4 సీజన్ లు కలిపి సుమారు రూ.770 కోట్లు రైతు భరోసా ఎగ్గొట్టారని అన్నారు. పసుపుకు క్వింటాలుకు రూ.12000 ఇస్తామని మాట ఇచ్చారు కానీ, రూ.9000 కంటే ఎక్కువ రైతు కు ధర రాలేదని, మీరు గ్యాప్ 3000 క్వింటాలుకు చెల్లించాలన్నారు. ఎకరానికి 30 క్వింటాళ్ల పంట పండిన మీరు రైతుకు ఏకరానికి  రూ.90 వేలు బాకీ ఉన్నారన్నారు.40 వేల ఎకరాల్లో పసుపు పంట పండిన రెండు సీజన్ లు కలిపి సుమారు రూ.720 కోట్లు జిల్లా రైతులకు బాకీ ఉన్నారన్నారు. రుణమాఫీ,రైతు భరోసా,బోనస్, పసుపు రైతులకు కలిపి కేవలం నిజమాబాద్ జిల్లా రైతులకే మీ కాంగ్రెస్ ప్రభుత్వం 4500 కోట్లు బాకీ ఉందిని అన్నారు. ఈ విషయంలో ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్రలో జిల్లా రైతులకు సమాధానం చెప్పాలన్నారు. యూత్ డిక్లరేషన్ పేరిట ప్రియాంక గాంధీ ని తీసుకొచ్చి యూత్ కు హామీలు ఇప్పించారని, మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని అన్నారు.కేవలం 5083 ఉద్యోగాలు మాత్రమే అని అశోక్ సార్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ నిరుద్యోగులతో  ఏర్పాటు చేసిన సభలోనే కుండబద్దలు కొట్టారని అన్నారు. రూ.4000 నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారని.ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితుల్లోరూ. 10 లక్షల ఆర్థిక సహాయం చేస్తామన్నారని మరి ఇప్పటికి వరకు ఒక్కరిక్కన్న ఇచ్చారా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు ,విద్యార్థినులకు స్కూటీ లు ఇస్తామన్నారు ఒక్కటన్న అమలు అయ్యిందా అని ఆయన ప్రశ్నించారు. మీనాక్షి నటరాజన్ పాదయత్రలో జిల్లా నిరుద్యోగ యువతకు,విద్యార్థులకు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే అన్నారు. కామారెడ్డి బిసి డిక్లరేషన్ కు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్యను తీసుకొచ్చి ప్రజలకు హామీలిచ్చా రని, పథకాలు కాకుండానే ప్రత్యేకంగా బీసీ ల కోసం 5 ఏండ్లలోరూ. లక్ష కోట్లు ఖర్చు చేస్తాం అని, 20 నెలల్లో  సుమారు రూ.30000 కోట్లు ఖర్చు చేయాల్సింది చేశారా అని ఏద్దేవా చేశారు. స్థానిక సంస్థల్లో, విద్యా ఉద్యోగాల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ లు 6 నెలల్లో  కల్పిస్తాం అని హామీ ఇచ్చారని, అసెంబ్లీ లో బిల్లు అని ఒకసారి,ఆర్డినెన్స్ అంటూ మరొకసారి  కాలయాపన చేసి,చివరికి కేంద్రం పైకి తోసి బీసీ లను మభ్యపెడుతున్నారన్నారు. అన్ని ప్రభుత్వ కాంట్రాక్ట్ లో 42 శాతం బిసి లకు కేటా ఇస్తామన్నారు.ఇచ్చారా? అని ప్రశ్నించారు.ఈ విషయమై మీనాక్షి నటరాజన్ పాదయాత్రలో జిల్లా బీసీ లకు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

More articles

Latest article