24.1 C
Hyderabad
Monday, August 3, 2026

జై భీం.. జై బాపు.. జై సంవిధాన్ సన్నాహక సమావేశం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జాతీయ కాంగ్రెస్ ఆదేశానుసారం రాష్ట్ర కాంగ్రెస్ చేపడుతున్న జై బాపు జై భీం జై సంవిధాన్ సన్నాహక సమావేశంలో గురువారం 47,48,49 డివిజన్ల కోఆర్డినేటర్ బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. నగరంలోని గంగపుత్ర సంఘం, నాగేంద్ర మందిరం వద్ద నిర్వహించిన కార్యక్రమానికి ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ ముఖ్య అతిధిగా హాజరై కార్యక్రమ సరళి గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి డీసీసీ జనరల్ సెక్రటరీ బింగి మధు, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు వినయ్, మాజీ జెండాగుడి చైర్మన్ నాని, కరాటే రమేష్, రాజు, పరమేశ్వర్, ఆకుల వెంకటేష్, ఆమ రాజు, ఆకుల మహేందర్, అరుణ్, శంకర్, బోటి వినోద్, సాయి కిరణ్, సయ్యాజీ, అమీర్, ఇమ్రాన్, ముదస్సిర్, సుదర్శన్, విక్కీ, మహేష్, ఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article